రానాలోని ఆ కొత్త‌ కోణం .. తెలిస్తే షాక్ తింటారు!

Saturday, February 10th, 2018, 11:40:10 PM IST

బాహుబ‌లి సిరీస్‌తో జాతీయ స్థాయిలో పాపుల‌ర‌య్యాడు రానా. భ‌ళ్లాల‌దేవ‌గా క్రూరుడిగా న‌టించి మెప్పించాడు. అయితే రానాలోని యాక్ష‌న్ కోణం మాత్ర‌మే జ‌నాల‌కు తెలుసు. అత‌డిలోని కొత్త కోణం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువే. ఆ కొత్త కోణాన్ని తెర‌పై చూస్తార‌ని చెబుతున్నారు `వెల్‌కం టు న్యూయార్క్` ద‌ర్శ‌కుడు చ‌క్రి తోలేటి. ఈ చిత్రంలో రానా లోని కామెడీ యాంగిల్‌ని తెర‌పై చూస్తారు. అత‌డు కెమెరా ముందుకు వ‌చ్చి న‌టించేప్పుడు.. కామెడీ చేసే విధానం అద్భుతం అంటూ చ‌క్రి కితాబిచ్చాడు. మంచి ఉపాధి, జీవితం కోసం.. న్యూయార్క్ వెళ్లిన ఇద్ద‌రు కుర్రాళ్లు ఊహించ‌ని రీతిలో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ వ‌ల్ల‌ ఎలాంటి సాహ‌సాలు చేయాల్సొచ్చింది? ఆ క్ర‌మంలో ఎలాంటి కామెడీ పుట్టింది అన్న‌దే సినిమా. రానాలోని కామిక్ యాంగిల్ చూపిస్తున్నామ‌ని చ‌క్రి తోలేటి తెలిపారు.

ఇప్ప‌టికే `వెల్‌కం టు న్యూయార్క్` ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఆ ట్రైల‌ర్‌లో రానా లుక్‌పై క‌ర‌ణ్ జోహార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. క‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ అతిధి పాత్ర‌లో న‌టించ‌డం కూడా ఓ విశేష‌మే. దిల్జీత్ దోసాంగి, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్‌, లారా ద‌త్తా, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. కామెడీ సినిమాలంటే గోల్ మాల్ సిరీస్ అనుకునేవారికి ఈ చిత్రం మ‌రో కోణంలో వెల్ ట్రీట్ అని చెబుతున్నారు.