నేను గుర్తించా..మీరూ గుర్తించండి అంటూ రాష్ట్రపతికి రానా లేఖ..!

Wednesday, February 15th, 2017, 09:00:39 PM IST


ఆరడుగుల ఆజానుబాహుడు గా పేరుగాంచిన దగ్గుబాటి రానా నటించిన ఘాజీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది.ఈ చిత్రం జలాంతర్గాములు సంబందించిన యుద్ధ నేపథ్యం లో రాబోతోంది. 1971 కాలంలో భారత్, పాక్ జలాంతర్గాముల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు. ఈ చిత్రంలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం రానా యుద్ధసమయంలో జలాంతర్గామిలో ఉన్న పలువురు ఆర్మీ అధికారులను రానా కలిసాడు. అప్పటిపరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

ఆ సమయం లో తాము అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని వారు రానాకు వివరించారు. వారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తించాలని రానా రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఘాజీ సినిమా వచ్చే వరకూ భారత సరిహద్దుల్లో పోరాడుతున్న ఇలాంటి హీరోల గురించి నాకు తెలియదు. నాలాంటి సామాన్య ప్రజలు చాలా మంది ఉన్నారు. వారంతా ఈ నిజమైన హీరోల గుర్తించాలి. వారి గురించిన మరిన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రానా రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర స్పెషల్ షో నేడు ప్రదర్శింపబడింది. ఈ చిత్రం అద్భుతంగా ఉందనే టాక్ ప్రముఖుల నుంచి వినిపిస్తోంది.