లీడర్ సీక్వెల్ కు రానా సన్నాహాలు ?

Thursday, July 26th, 2018, 09:40:10 AM IST

అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ రానా ఎంట్రీ లీడర్ సినిమాతో జరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రానా హీరోగా చేసిన ఏ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక బాహుబలి తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక సోలో హీరోగా చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్న రానా తనకు హీరోగా మంచి క్రేజ్ తెచ్చిన లీడర్ సినిమాను సీక్వెల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తీ చేసి వచ్చే ఎన్నికల ముందు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments