సంజయ దత్ లుక్ లో యువ హీరో అదరగొట్టేశాడు !

Tuesday, February 21st, 2017, 04:17:01 PM IST


బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఎప్పుడూ రఫ్ లుక్ లో కనిపిస్తాడు.యువహీరో రణబీర్ కపూర్ మిల్కి బాయ్ లా ఉంటాడు. వీరిద్దరి మధ్య అస్సలు పోలిక ఉండదు. కానీ సంజయ దత్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించే చిత్రంలో రణబీర్.. సంజయ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం మొదలైంది.సంజయ్ పాత్రలో రణబీర్ సూటవుతాడా అనే అనే అనుమానాలు బాలీవుడ్ వర్గాల్లో ఉండేవి. ఇటీవల ఈ చిత్ర సెట్స్ ఉంచి రణబీర్ లుక్ లీకైంది. ఈ లుక్ లో రణబీర్ పూర్తిగా సంజయ్ దత్ లా మారిపోయాడు. దీనితో అందరి అనుమానాలు తొలగిపోయాయని అంటున్నారు.

90 దశకంలో సంజయ్ దత్ లుక్ ఎలా ఉండేవాడు, ఎలాంటి వస్త్రధారణని అతడు ధరించేవాడు అన్న అంశాలనిపరిశీలించి రణబీర్ లుక్ ని డిజైన్ చేసారు. లీకైన ఫొటోల్లో రణబీర్ సంజయ్ దత్ ని తలపిస్తున్నాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా బాలీవుడ్ తారలు అనుష్క శర్మ, సోనమ్ కపూర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.