మాజీ ప్రేమ‌ప‌క్షులు ఒకేసారి జ్వ‌రంతో..!

Sunday, April 8th, 2018, 10:10:55 PM IST

మాజీ ప్రేమికులు ర‌ణ‌బీర్ క‌పూర్‌- దీపిక ప‌దుకొన్ స‌ప‌రేష‌న్ గురించి తెలిసిందే. క‌త్రిన‌తో ర‌ణ‌బీర్ సాగించిన ఎఫైర్ కు ముందు దీపిక‌తో చాక్లెట్‌బోయ్ రొమాంటిక్‌ విలాపం సాగించాడు. అయితే ఆ క్ర‌మంలోనే మ‌నస్ఫ‌ర్థ‌ల‌తో విడిపోయారు. ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. ఆ త‌ర‌వాత ర‌ణ‌బీర్ పాకిస్తానీ గాళ్ మ‌హీరాఖాన్‌తో ల‌వ్ లైఫ్ సాగించాడు. అటుపై తాజాగా బ్ర‌హ్మాస్త్ర కోస్టార్ ఆలియాతోనూ ల‌వ్వాయ‌నం సాగిస్తున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక ఇదే సీన్‌లో దీపిక ప‌దుకొన్ మాత్రం త‌న తాజా బోయ్‌ఫ్రెండ్ ర‌ణ‌వీర్ సింగ్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది.

అయితే ఈ కాంబినేష‌న్ డివైడ్ నేప‌థ్యంలో.. ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ షో మిజ్వాన్‌ నిర్వాహ‌కులు డిఫ‌రెంట్ ఆలోచ‌న‌తో ఓ ప్యాష‌న్ షోని ఏర్పాటు చేశారు. ఇందులో ర‌ణ‌బీర్‌, దీపిక ప‌దుకొన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉండ‌గా, ఆ ఇద్ద‌రూ జ్వ‌రం వ‌చ్చి వ‌డ‌పిట్ట‌ల్లా ప‌డిపోయారుట‌. దీంతో షోని మ‌రో వారం పాటు వాయిదా వేశారు. సో బ్యాడ్‌!

  •  
  •  
  •  
  •  

Comments