సంజయ్ దత్ బయోపిక్ టీజర్ : 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ – ఏకే-47

Tuesday, April 24th, 2018, 04:30:13 PM IST

బాలీవుడ్ లో గత కొంత కాలంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సంజయ్ దత్ బయోపిక్ కోసమే. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంజు అని టైటిల్ సెట్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. సంజయ్ పాత్రలో రన్ బీర్ కపూర్ కనిపించిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదట జైలు నుంచి విడుదలైన సంజయ్‌ తన గురించి పరిచయం చేసుకున్నాడు. కొంచెం కామెడిగానే పరిచయం చేసుకున్నాడు.

నా జీవితం రోలర్‌ కోస్టర్‌ రైడ్‌. 22 ఏళ్లలోనే డ్రగ్స్ బారిన పడ్డాను. దీంతో ఊరిపితిత్తులు చెడిపోవడంతో డాక్టర్లు బ్రతకనని చెప్పారు. అప్పుడే జిమ్‌లో వర్కౌట్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకున్నా. బస్సు టికెట్‌ కోసం అడుక్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక అప్పుడే డబ్బు సంపాదించాక విదేశాలకు వెళ్లి అతిపెద్ద బిల్డింగుల్లో నివసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఏకే-47 రైఫిల్‌ ఉందని చెప్పిన డైలాగ్ టీజర్ పై అంచనాలను పెంచింది. సోనమ్ కపూర్ మనిషా కొయిరాలా వంటి నటీనటులు కొన్ని ముఖ్య పాత్రల్లో సినిమాల్లో కనిపించనున్నారు. జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments