ర‌ణ‌బీర్‌తో ప్రేమ‌లో ప‌డకు.. గుండెను కోసేస్తాడు!

Saturday, February 10th, 2018, 12:12:00 PM IST

చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ప్రేమలో ప‌డొద్దు. ఒక‌వేళ ప్రేమలో ప‌డితే గుండె కోత త‌ప్ప‌దు.. అని యువ‌క‌థానాయిక ఆలియాను ఓ అప‌రిచిత వ్య‌క్తి హెచ్చ‌రించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ర‌ణ‌బీర్ ఇలా అమ్మాయిల‌తో ఆడుకుంటాడ‌ని ఆలియా భ‌ట్‌కు అత‌డు సూచించ‌డం విశేషం.ఇంట్రెస్టింగ్ గా ఆ లీకులు ఇచ్చేది ర‌ణ‌బీర్ స‌న్నిహితుడేన‌ట‌. “ర‌ణ‌బీర్‌తో ఇట్టే ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ త‌ర్వాత అత‌డి వ‌ల నుంచి త‌ప్పించుకోలేరు. గుండెకు గాయం చేస్తాడు..“ అంటూ స‌ద‌రు క‌పూర్ గ‌య్ చెప్పాడుట. ర‌ణ‌బీర్ క‌పూర్‌ – ఆలియా `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్‌లో ఏర్ప‌డిన స్నేహం కాస్తా శ్రుతి మించుతోంద‌ని, ర‌ణ‌బీర్ ముందుగా ముగ్గులోకి దించుతాడ‌ని ఆలియాని భ‌య‌పెట్టేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఒక‌రితోనొక‌రు చ‌నువుగా ఉంటున్నారు.

అస‌లే ఆలియా త‌న బోయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా నుంచి విడిపోయిన బాధ‌లో ఉంది. ఇలాంట‌ప్పుడు ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంద‌ని స‌ద‌రు అప‌రిచితుడు అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. ర‌ణ‌బీర్ గ‌తంలో క‌త్రిన‌తో డేటింగ్ చేశాడు. క‌త్రిన నుంచి బ్రేక‌ప్ అయ్యాక వేరొక నాయిక‌ మ‌హిరా ఖాన్‌తో ప్రేమ నాట‌కం ఆడాడు. ప్ర‌స్తుతం ఆలియాపై దృష్టి సారించాడు.. అంటూ స‌ద‌రు అన్‌నోన్ ప‌ర్స‌న్ అంటున్నాడుట‌. అత‌గాడి హెచ్చ‌రిక‌ల మాటేమో గానీ, ఆలియా ల‌వ్ స్టోరిలో ఇంకో ట్విస్టు రివీలైంది. ఆలియా ప్ర‌స్తుతం ల‌వ్‌లో ఉంది. అయితే అది ర‌ణ‌బీర్‌తో కాదు, వేరొక వ్య‌క్తితో. `ఎయిర్‌టెల్` అధినేత సునీల్ మిట్ట‌ల్ కుమారుడు క‌విన్ మిట్ట‌ల్‌తో ఆలియా ప్రేమ‌లో ప‌డింద‌ని రివీలైంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ స‌మావేశాల వేళ ఆ ఇద్ద‌రికీ ప‌రిచ‌యమైంది. ఆ త‌ర్వాత మిట్ట‌ల్‌తో ఆలియా స్నేహంగా ఉంటోంద‌ని చెబుతున్నారు.