లిరికల్ వీడియో : విడుదలయిన ‘రంగ రంగ రంగస్థలాన’ సాంగ్

Friday, March 2nd, 2018, 06:37:07 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న సినిమా రంగస్థలం. రామ్ చరణ్ కు జోడిగా ఈ సినిమాలో సమంత నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఎంత సక్కగున్నావే సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా నేడు రంగ రంగస్థలాన అనే పల్లవితోసాగే రెండవ పాటని యూనిట్ విడుదల చేసింది. ఈ పాట ప్రారంభం లో కనపడేట్టు కాదు, వినపడేట్టు కొట్టండి రా అని రాంచరణ్ చెప్పిన డైలాగు తో ప్రారంభం అవుతుంది. వినగానే కాచీగా వుండే పక్క మాస్ బీట్ తో సాగుతూ, పల్లెల్లో యువకులు సరదాగా పాడుకునే పాట మాదిరిగా వుంది. ప్రస్తుతం విడుదలయిన ఈ పాట ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే పదకొండు మిలియన్ వ్యూలు అందుకున్న మొదటిపాట ఎంత సక్కగున్నావే ని ఇది బీట్ చేస్తుందేమో చూడాలి…