బాబోయ్ .. చిట్టిబాబు దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలు ?

Monday, April 9th, 2018, 01:55:44 PM IST

చిట్టిబాబండి .. అంటూ రీ సౌండ్ తో రంగస్థలం లో అదరగొట్టిన రామ్ చరణ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో సౌండ్ ఇస్తోంది. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ ముప్పై న విడుదలై అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియోన్స్ ని ఆకట్టుకుంటూ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సాధిస్తుంది. ఇప్పటికే టాప్ టెన్ లిస్ట్ లో ఉన్న సినిమాలను ఒక్కక్కటిగా వెనక్కి నెట్టుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా టాలీవుడ్ లో 150 కోట్ల క్లబ్ లోకి చేరనుండగా .. కేవలం షేర్స్ లోనే వందకోట్ల వరకు రాబట్టి సత్తా చాటింది.

మరి రంగస్థలం 10 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం ( షేర్ లలో ). నైజాం – 19. 91 కోట్లు, సీడెడ్ – 13. 10 కోట్లు, నెల్లూరు – 2. 46 కోట్లు, కృష్ణా – 5. 40 కోట్లు, గుంటూరు – 6. 76 కోట్లు, వైజాగ్ – ఈస్ట్ – 5. 87 కోట్లు, వెస్ట్ – 4. 60 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 67. 63 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా కలిపి 92. 57 కోట్లు. ఈ లెక్కన ఈ శుక్రవారం వరకు ఖాళి ఉండడంతో మరో ఇరవై కోట్లు సులభంగా రాబట్టే ఛాన్స్ ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments