చిట్టిబాబు రీ సౌండ్ తో అదరగొడుతున్నాడు ?

Saturday, April 7th, 2018, 10:56:35 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఇటీవలే విడుదలై ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది. విడుదలైన ప్రతి సెంటర్ లో అదిరిపోయేలా వసూళ్లు సాధిస్తూ తన రేంజ్ ఏమిటో చూపిస్తున్నాడు చిట్టిబాబు. చరణ్ , సమంత ల నటన, డైరెక్షన్ హైలెట్ గా సాగిన ఈ సినిమా ఇప్పటికే కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. కేవలం 4 రోజులకే 130 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా ఆరు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఈ సినిమా ఆరు రోజులకు గాను 54 కోట్ల షేర్ ని కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి 80 కోట్ల కు పైగా షేర్ రాబట్టడం విశేషం. 6 రోజుల వసూళ్లు షేర్ లలో .. నైజాం – 15. 84 కోట్లు, సీడెడ్ – 10. 35 కోట్లు, నెల్లూరు – 1. 09 కోట్లు, కృష్ణా – 4. 34 కోట్లు, గుంటూరు – 5. 79 కోట్లు, వైజాగ్ – 7. 37 కోట్లు, ఈస్ట్ – 4. 88 కోట్లు, వెస్ట్ – 3. 70 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 54. 22 కోట్ల వసూళ్లతో దుమ్ము రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments