రంగస్థలం ఆడియోకి భలే క్రేజ్ ?

Sunday, December 3rd, 2017, 11:00:06 PM IST

క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమా టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1985 కాలం నేపథ్యంలో రూపొందడం .. దానికి తగ్గట్టుగానే భారీ సెట్టింగుల్లో సినిమా షూటింగ్ జరపడం విశేషం. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కులకోసం భారీ పోటీ నెలకొంది .. అత్యంత భారీ పోటీ మధ్య లహరి మ్యూజిక్ కంపెనీ ఏకంగా 1. 6 కోట్లకు ఈ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. సుకుమార్ సినిమాలో పాటలకు ఎంత ప్రాముఖ్య ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అయన సినిమా ఆడియోస్ అన్ని సూపర్ హిట్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటలను త్వరలోనే విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా ముందుగా అనుకున్నట్టు సంక్రాంతికి కాకుండా మార్చ్ లో విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments