బాహుబలి రికార్డుకు చిట్టి బాబు ఎసరు ?

Monday, April 2nd, 2018, 10:15:47 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ చూపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో 1980 నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ సినిమా రొండో రోజు బాహుబలి మొదటి భాగం రికార్డ్స్ ను అందుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రొండో రోజే 13. 25 కోట్ల గ్రాస్ .. 8. 76 కోట్ల షేర్ తో బాహుబలి రెండో రోజు రికార్డును దాదాపు దాటేసినట్టే. రంగస్థలం దెబ్బకు అంతవరకు టాప్ వసూళ్లలో ఉన్న దువ్వాడ జగన్నాధం, ఖైదీ నంబర్ 150 చిత్రాలు వెనక్కి వెళ్లిపోయాయి. చిట్టిబాబు దూకుడు చూస్తుంటే వీకెండ్ వరకు వందకోట్ల మార్కెట్ సాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చిట్టిబాబు రెండు రోజుల్లో ఎంత వసూలు చేసాడు చూద్దాం ..
ఆంధ్రా – తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్ ( షేర్ లలో )
నైజాం – 7. 22 కోట్లు,
సీడెడ్- 5. 50 కోట్లు,
నెల్లూరు – 1. 06 కోట్లు,
గుంటూరు – 3. 40 కోట్లు,
కృష్ణా – 2. 04 కోట్లు,
వెస్ట్ – 2. 12 కోట్లు,
ఈస్ట్ – 2. 71 కోట్లు,
ఉత్తరాంధ్రా – 3. 78 కోట్లు,
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27. 80 కోట్లు షేర్ వసూలు చేసి రామ్ చరణ్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది.