కొత్త రికార్డు దిశగా… రంగస్థలం ?

Friday, April 6th, 2018, 11:07:31 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ పై ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే వందకోట్ల గ్రాస్ కేవలం మూడు రోజుల్లో దాటేసిన ఈ సినిమా రోజు రోజుకు కలక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. కేవలం 4 రోజుల్లో 112 కోట్ల గ్రాస్ తో 73 కోట్ల షేర్ తో షాకిచ్చింది. ఇక వీకెండ్ వరకు చూసుకుంటే ఏకంగా 132 కోట్ల గ్రాస్ తో దుమారం రేపగా ఇప్పటికే 80 కోట్లకు పైగా షేర్ వాచినట్టు తెలుస్తోంది. బాహుబలి తప్పిస్తే .. అల్ టైం గ్రాస్ కలక్షన్స్ లో టాప్ రేంజ్ లో ఉన్న శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, జై లవకుశ సినిమాలను దాటేస్తుందని అంటున్నారు. మంచి విడుదల డేట్ పడడం .. దానికి పోటీగా మరో సినిమా లేకపోవడంతో రంగస్థలం కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

  •  
  •  
  •  
  •  

Comments