బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తున్న రంగస్థలం !!

Monday, May 7th, 2018, 10:49:04 PM IST


టాలీవుడ్ కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్టుంది. గత ఏడాది బాహుబలితో తుప్పుపట్టిన బాక్స్ ఆఫీస్ బూజు దులిపి ఓ రేంజ్ లో సంచలన వసూళ్లు దక్కించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తి తో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా నాన్ బాహుబలి రికార్డులలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సంచలన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 30న విడుదలై ఇప్పటికి అన్ని థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఇక 200 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా టాలీవుడ్ లో రికార్డు అందుకుంది. వసూళ్ల పరంగా 102 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఒక్క నైజం ఏరియాలోనే 34 కోట్ల షేర్ వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కేవలం 18 కోట్లకు మాత్రమే అమ్మేసారు .. కానీ దానికి రెట్టింపుగా వసూలు చేసి రామ్ చరణ్ స్టామినా ప్రూవ్ చేసింది. ఇక సీడెడ్ లో 12 కోట్లకు అమ్ముడు పోగా .. 17 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్రా లో 8 కోట్లకు అమ్ముడైతే .. 12 కోట్లు, ఓవర్ సీస్ లో 9 కోట్లకు అమ్ముడైతే .. 17 కోట్ల వసూళ్లు అందుకుంది. మొత్తానికి ఈ ఏడాది కూడా బాక్స్ ఆఫీస్ కళకళలాడిందని చెప్పాలి.

Comments