200 కోట్ల వసూళ్ల దిశగా రంగస్థలం ?

Monday, April 16th, 2018, 09:53:02 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఇటీవలే విడుదలై ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లు అందుకుంది. ఇప్పటికే 175 కోట్ల గ్రాస్ తో దుమ్ము రేపుతున్న ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో 200 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. బాహుబలి సినిమా తరువాత ఆ రేంజ్ లో వసూళ్లు అందుకున్న చిత్రంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అమెరికాలో ఏకంగా మూడో వారంలోనే .. 3, 286,022 డాలర్స్ వసూలు చేసి సత్తా చాటింది. రంగస్థలం సినిమాకు ఇంకా ఓ రేంజ్ లో క్రేజ్ దక్కుతూనే ఉంది. ఇప్పటికి చాలా థియేటర్స్ హౌస్ ఫుల్స్ గా నడవడం విశేషం. సమంత, రామ్ చరణ్ ల నటన హైలెట్ గా సాగిన రంగస్థలం చాలా మందికి తమ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసిందని అంటున్నారు .

  •  
  •  
  •  
  •  

Comments