చరణ్ కూడా వైజాగ్ లోనే చేస్తాడట ?

Tuesday, February 13th, 2018, 11:45:54 PM IST

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న రంగస్థలం షూటింగ్ ఆదివారంతో పూర్తయింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. తాజాగా ఈ రోజు ఎంత సక్కగున్నావే సాంగ్ .. విడుదలైన కొన్ని గంటల్లోనే దుమ్ము రేపుతోంది. అచ్చతెలుగు పల్లెటూరి నేపథ్యంలో సాగిన ఆ సాంగ్ సోషల్ మీడియా లో ఒక ఊపు ఊపేస్తోంది. దేవి సంగీత మాయాజాలం .. చంద్రబోస్ అచ్చతెలుగు పల్లె పదాలు .. వెరసి ఎంత సక్కగున్నావే.. అంటూ రామ్ చరణ్ సమంత అందాలను పొగిడేస్తూ పాడిన సాంగ్ టాప్ చార్ట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మార్చ్ 30 న విడుదల అయ్యే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మార్చ్ 18న గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక వైజాగ్ లో జరగనుందట. ఈ మధ్య ప్రీ రిలీజ్ వేడుకలు ఎక్కువగా వైజాగ్ లో నిర్వహిస్తున్నారు .. రామ్ చరణ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసారని తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments