రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సన్నాహాలు ?

Sunday, March 11th, 2018, 11:21:05 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అచ్చమైన పల్లెటూరి యువకుడిగా 1985 నేపథ్యంలో రూపొందిన కథతో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ఓ రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న ఈ వేడుకను వైజాగ్ ఆర్కే బీచ్ లో జరపనున్నారు. అందుకోసం అక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 30 న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.