నాలుగు లోక‌ల్‌ భాష‌ల్లో `రంగ‌స్థ‌లం`?

Friday, April 13th, 2018, 11:29:36 PM IST


ఏ నోట విన్నా రంగ‌స్థ‌లం రికార్డుల గురించే. ఇందులో చిట్టిబాబు న‌ట‌న‌, రంగ‌మ్మ‌త్త‌, రామ‌లక్ష్మి పెర్ఫామెన్స్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా సాధించిన బాక్సాఫీస్ రికార్డుల గురించి అదే ప‌నిగా లెక్క‌లు చెబుతున్నారు. టాలీవుడ్‌లో నాన్ బాహుబ‌లి రికార్డుల్ని వేటాడి, ప్ర‌స్తుతం నంబ‌ర్ -1 చిత్రంగా నిలిచిన ఈ సినిమాని ఇంకా ఇంకా ప్ర‌మోట్ చేసేందుకు బాబాయ్‌- అబ్బాయ్ ఏక‌మ‌య్యారు. నేటి లైవ్‌లో ఆ ఇద్ద‌రూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా క‌నిపించారు.

సేమ్ టైమ్ రంగ‌స్థ‌లంకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందింది. `రంగ‌స్థ‌లం` చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. మైత్రి సంస్థ ఆ మేర‌కు స‌న్నాహాలు ప్రారంభించింది. రంగ‌స్థ‌లం చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా హిందీ, మ‌ల‌యాళం, భోజ్‌పురి, త‌మిళ్ భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. అంటే కేవ‌లం చిట్టిబాబు గ్లింప్స్, గోదారి గ్లింప్స్‌ మ‌న‌కే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం కానున్నాయ‌న్నమాట‌!