కలెక్షన్స్: `రంగ‌స్థ‌లం` ఏరియా వైజ్

Sunday, April 1st, 2018, 04:04:46 PM IST

గోదారి నేప‌థ్యంలో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం` తొలి నుంచి పాజిటివ్ సంకేతాలే ఇచ్చింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఈ సినిమా తొలిరోజు వ‌సూళ్ల లెక్క‌లు ప‌రిశీలిస్తే, పాత‌ రికార్డుల్లో చాలా వాటిని వేటాడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

`రంగ‌స్థ‌లం` మొద‌టిరోజు షేర్ వ‌సూళ్లు ప్రాంతాల వారీగా ప‌రిశీలిస్తే.. ఈ సినిమా తొలిరోజు 44 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. నైజాం- 4.43 కోట్లు, వైజాగ్‌-2.43 కోట్లు, తూ.గో జిల్లా-2.03కోట్లు, ప‌.గో.జిల్లా-1.60కోట్లు, కృష్ణ‌-1.55 కోట్లు, గుంటూరు-3.15కోట్లు, నెల్లూరు-0.75కోట్లు, సీడెడ్‌-3.55కోట్లు, ఓవ‌రాల్‌ ఏపీ -11.51 కోట్లు, నైజాం, ఏపీ క‌లుపుకుని 19.49 కోట్లు వ‌సూలైంది. అమెరికా- 4.92 కోట్లు, క‌ర్నాట‌క‌-2.15కోట్లు, ఇత‌ర ఏరియాల్లో -1.80కోట్లు, ఓవ‌రాల్‌గా -28.36 కోట్ల షేర్ వసూలైంది. గ్రాస్ వ‌సూళ్లు ప‌రిశీలిస్తే… నైజాం-7.0కోట్లు, ఏపీ -16.9 కోట్లు, సీడెడ్ -4.4 కోట్లు, నైజాం, ఏపీ క‌లుపుకుని 28.3కోట్లు, అమెరికా-8.2 కోట్లు, క‌ర్నాట‌క -3.5 కోట్లు, ఇత‌ర చోట్ల 3.8 కోట్లు, ఓవ‌రాల్‌గా మొత్తం గ్రాస్ -43.8 కోట్లు వ‌సూలైంది. మొద‌టి రోజు దూకుడు చూస్తుంటే ఈ వీకెండ్‌లోనే ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్టుగా నిలిచే ఆస్కారం ఉంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. అంతేకాదు.. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.