ఓవర్సీస్ లో ‘రంగస్థలం’ అద్భుత రికార్డు!

Monday, April 9th, 2018, 03:17:58 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ దర్శకత్వం లో సమంత హీరోయిన్ గా ఇటీవల విడుదలయిన సినిమా రంగస్థలం. విడుదలయిన తొలిరోజు నుండే అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ దూసుకుపోతున్న ఈ సినిమా నేడు మరొక అద్భుత రికార్డు సొంతం చేసుకుంది. ఆంధ్ర, సీడెడ్, నైజాం అని తేడాలేకుండా విడుదలయిన ప్రతిచోటా ప్రజలు ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్లో నాన్ బాహుబలి రికార్డుగా వున్న శ్రీమంతుడు రికార్డును ఈ సినిమా అధిగమించి అద్భుత రికార్డు క్రియేట్ చేసింది.

విశ్లేషకుల నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు 2,891,210 డాలర్లు (రూ. 18 కోట్లు+) వసూలు చేసి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. అయితే ఇదివరకు రికార్డుగా వున్న శ్రీమంతుడు 2,890,786 డాలర్లు (రూ.18 కోట్లు) సాధించింది. అక్కడ ఈ సినిమాకంటే ముందు బాహుబలి ది బిగినింగ్ 6,999,312 డాలర్లు (రూ.45 కోట్లు)తో రెండవ స్థానంలో ఉండగా, బాహుబలి ది కంక్లూజన్ 20,571,695 డాలర్లు (రూ.133 కోట్లు)తో నెంబర్ వన్ స్థానంలో వుంది…..