రాజమండ్రిలో రంగస్థలం చివరి షెడ్యూల్ ?

Wednesday, January 3rd, 2018, 10:22:17 AM IST

మేగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు హైద్రాబాద్ లో జరిగిన భారీ షెడ్యూల్ తో సినిమా దాదాపు కంప్లీట్ చేసారు. ఇక ఈ ఈరోజు నుండి మొదలయ్యే చివరి షెడ్యూల్ ని రాజమండ్రి లో జరపనున్నారు. ఈ షెడ్యూల్ ను ఈ నెల 12 వరకు జరపడంతో సినిమా టాకీ పార్టీ మొత్తం పూర్తవుతుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 1985 నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. వచ్చే నెలలో పాటలను విడుదల చేసి చిత్రాన్ని మార్చ్ 30న విడుదల చేస్తారట.