యూఎస్ ప్రీమియర్ షో టాక్ : రంగస్థలం ఎలా ఉందంటే?

Friday, March 30th, 2018, 04:55:00 PM IST

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ – సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన రంగస్థలం సినిమా శుక్రవారం మన ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే మనకంటే ముందే ప్రవాసులు ప్రీమియర్స్ ద్వారా వీక్షించేశారు. మెగా అభిమనుల సందడితో అక్కడ మొదటి ఆట చాలా విజయవంతంగా ప్రదర్శించబడింది. దర్శకుడు పాత్రలను పరిచయం చేసిన తీరు చాలా బావుంది. రంగస్థలం అనే ఊరిలో ఉన్నట్లు.. అది 1980 కాలం అన్నట్లు.. కొన్ని సీన్స్ తోనే అర్థమయ్యేలా దర్శకుడు చేప్పేశాడు.

రామ్ చరణ్ తన కెరీర్ లో ఈ సినిమాలో ఇచ్చినంత సింపుల్ ఎంట్రీ ఎందులోనూ ఇవ్వలేదనే చెప్పాలి. సైకిల్ పైన వస్తుండడం. ఆ తరువాత ఫన్నీగా మిగతా పాత్రలు కలవడం చాలా స్పీడ్ గా కథ ముందుకు వెళుతుంటుంది. దీంతో సినిమా అర్ధాన్ని చెప్పేలా రంగా రంగ రంగస్థలాన అనే పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక రంగమ్మ పాత్రలో అనసూయ వెరైటీగా ఎంట్రీ ఇవ్వగా.. జగపతి బాబు చాలా సైలెంట్ గా ఉంటూనే భయంకరంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటన చాలా బావుంటుంది. ఆది పినిశెట్టి చిట్టి బాబు అన్నయ్యగా.. రోహిణి – నరేష్ వారి తల్లిదండ్రులుగా కనిపించారు.

కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కామెడీ సన్నివేశాలు అలాగే ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో హైలెట్ గా నిలిచాయి. సమంత ఎంట్రీ తో వచ్చే ఎంత సక్కగున్నావే సాంగ్ కూడా మరో హైలెట్. సమంత నటన కూడా బాగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ కి ముందు కథలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండడం పెద్ద మైనెస్ అని చెప్పాలి. ఎలక్షన్స్ కి సంబందించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఊహించిన సన్నివేశాలే వస్తుంటాయి. డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. యాక్షన్స్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తంగా సినిమాలో చరణ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. చెవులు వినిపించని చిట్టిబాబుగా చెర్రీ కనబరిచిన హావభావాలు అలాగే సినిమా పాటలు మరో బలం. సెట్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కానీ మొత్తంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.