లేటెస్ట్ న్యూస్ : హైదరాబాద్ గూగుల్ మ్యాప్ లో రంగస్థలం…

Wednesday, April 4th, 2018, 03:00:46 PM IST

రంగస్థలం చాలా రోజుల నుండి తెలుగు సినీ అభిమానులలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా. 5 రోజుల క్రితం విడుదల గావించుకొని ఏ స్థాయిలో లో అభిమానుల అంచనాలు తారాగనంకి అందుకున్నాయో అదే స్థాయిలో హిట్టు కొట్టి బాక్సాఫీస్ కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా, సమంతా హీరోయిన్ గా నటించగా ప్రముఖ సీనియర్ నటులు ప్రకాష్ రాజ్. జగపతి బాబు విలన్స్ గా నటించారు. ఎవ్వరూ కూడా కథకి సంబందించిన పాత్రలలో ఎక్కడా తీసిపోకుండా వారి వారి శైలిలో తమ నటనను అభినయించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెర్రకేక్కిన ఈ సినిమాలో ప్రముఖ టీ.వీ. యాంకర్ అనసూయ, హీరో ఆది ఫనిశెట్టి అద్భుతమైన రోల్స్ చేసి ప్రేక్షకులకి కంటతడి పెట్టుకునేల అభినయించారు. ఇక నటన విషయం పక్కన పెడితే సినిమా సెట్టింగ్స్. రంగస్థలం 1985 సినిమా పేరుకు తగ్గట్టుగా డైరెక్టర్ సుకుమార్ ప్రతీ సన్నివేశాన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఆనాటి బ్యాక్ గ్రౌండ్స్ తో నిజంగానే 1985లో తీసిన సినిమాలాగా తీసి చూపించారు. అయితే హైదరాబాద్ జూబ్లీహిల్ల్స్ లో వేసిన ఈ సినిమా సెట్స్ గూగుల్ మ్యాప్ లోని కనువిందు పరుస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సేన్షేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రామ కృష్ణ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యులో సినిమా సెట్స్ కు సంబందిచిన విషయాలు చెప్పారు. కేవలం సినిమా సెట్స్ కు 5 కోట్లు ఖర్చు పెట్టగా దీన్ని సుమారు 40 ఎకరాల స్థలంలో తీర్చిదిద్దడం జరిగిందని అంటే కాకుండా సమయం చాలా తక్కువగా ఉన్నందున 7 రోజుల్లో సెట్స్ కి సంబందించిన డిజైన్స్ పూర్తి చేస్కొని సుమారు 2 నెలల సమయం వెచ్చించి రంగస్థలాన్ని ఊరుని తయారు చేసాం అన్నారు. విశేషం ఏమిటంటే ఈ సెట్స్ అంతా కూడా హైదరాబాద్లోని జూబ్లీహిల్ల్స్ ఏరియాలో తయారు చ్జేసారు. సెట్స్ వేయక ముందు ఆ ప్రదేశమంతా కొండలు, రాళ్ళతో నిండి ఉందని 40 ఎకరాల్లో 2 చెట్లు తప్ప మరెక్కడా ఒక్క చెట్టైనా లేదని అన్నారు, కానీ దాన్ని కథకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆ ప్రాంతం అంతా కొన్ని లోడ్ల లారీలతో రకరకాల మట్టి తెప్పించి పోశారని ప్రస్తుతం, సెట్స్ లో ఉన్న చెట్లన్నీ వాళ్ళు నాటినవేనని అన్నారు. ఆ కాలం నాటి బ్యాక్ గ్రౌండ్ కనిపించేవిధంగా అణువణువూ చాలా ప్రత్యేక శ్రద్ధ తీస్కోని 30 ఎకరాల స్థలంలో సెట్స్ అమర్చామని అన్నారు. రంగ స్థలాన్ని ముస్తాబు చేసిన ప్రతీ అంశం సినిమాలో చూపించడం జరిగిందని ఏదీ కూడా మిస్సయి ఉండదని సినిమాకోసం డైరెక్ట్ సుకుమార్ కూడా చాలా జాగ్రత్త తీస్కోని చేసాడని ఆర్ట్ డైరెక్టర్ రామ కృష్ణ చెప్పాడు. ఎన్ని చెప్పుకున్నా ఇంత తక్కువ సమయంలో ఇందత గొప్ప దృశ్యాలను ప్రపంచానికి చూపించిన రంగస్థలం టీం కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక 5 రోజులు పూర్తి చేస్కుంటున్న ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ కలెక్షన్స్ లో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 56.30 కోట్లు షేర్ సాధించినట్లు తెలుస్తోంది, ఓవర్ సిస్ లో 2.8 మిలియన్లు సొంతం చేస్కొని మరింత పెద్ద సక్సెస్ వైపుకు దూసుకుపోతుంది.

గూగుల్ మ్యాప్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.