ట్రైలర్ టాక్ : రంగస్థలం కాదు.. రణస్థలం!

Sunday, March 18th, 2018, 09:51:06 PM IST

రామ్ చరణ్ – సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా ప్రేక్షుకులు ట్రైలర్ కోసమే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అనుకున్నట్టుగానే ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. సుకుమార్ చాలా క్లియర్ గా సినిమా అసలు పాయింట్ ని చెప్పకనే చెప్పాడు. సినిమాలో జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో ఊరి ప్రేజిడెంట్ గా కనిపిస్తున్నారు. ఆ తరువాత ఆది రామ్ చరణ్ ఆయనకు ఎదురెలుతారని అర్ధమవుతోంది. రామ్ చరణ్ నటనతో పాటు డైలాగులు మరో లెవెల్లో కనిపిస్తోందని చెప్పవచ్చు. అదే విధంగా సమంత కూడా పల్లెటూరి అమ్మాయిలా అందరిని ఆకట్టుకుంటుంది. దర్శకుడు సుకుమార్ పనితనం కూడా కొన్ని సీన్స్ లలో క్లియర్ గా కనిపిస్తోంది. 1980 నాటి కాలంలో నడిచే ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో ప్రకాష్ రాజ్ బ్రహ్మజీ వంటి సీనియర్ నటీనటులు కూడా నటించారు. మార్చ్ 30న సినిమా రిలీజ్ కానుంది.