రంగస్థలం ‘ఎ’ క్లాస్ గా వుంది అంటున్న టాలీవుడ్ హీరో

Sunday, April 1st, 2018, 03:49:08 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ టాక్ అందుకున్న సినెమా రంగస్థలం. ప్రస్తుతం ఎక్కడ చూసిన రంగస్థలం మేనియా సాగుతోంది. మరీ ముఖ్యంగా సామాన్య ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటి లు సైతం ఈ సినిమాని తెగ మెచ్చుకుంటున్నారు. అయితే అందులో భాగంగా నేడు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ఈ సినిమా అపి తన అభిప్రాయాన్ని వినూత్నంగా తెలిపారు.

ఆయన త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా ఈ సినిమాకు రేటింగ్ ఇచ్చారు. సినిమా `ఎ` క్లాస్‌గా ఉంద‌ని ప్ర‌శంసించారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాను చూసిన విజ‌య్, సినిమా అత్య‌ద్భుతంగా ఉంద‌ని, రాంచరణ్ సమంతల పెర్ఫార్మన్స్ సూపర్బ్ అని అని ట్వీట్ చేశారు. `రంగ‌స్థ‌లం-ఎ, పెర్ఫార్మెన్స్‌-ఎ, ద‌ర్శ‌క‌త్వం-ఎ, కెమేరా-ఎ, సంగీతం-ఎ, ప్రొడ‌క్ష‌న్‌-ఎ` అంటూ అంశాల వారీగా రేటింగ్ ఇచ్చారు. అలాగే సుకుమార్‌; ర‌త్న‌వేలు, దేవిశ్రీప్ర‌సాద్‌ లు సినిమాకు అదనపు బలమని ప్ర‌శంసించారు. మొత్తానికి మాత్రం రంగస్థలంతో భారీ హిట్ అందుకున్న రాంచరణ్ కు నెటిజన్లు పలురకాల హాష్ టాగ్ లతో నీరాజనాలు పలుకుతున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments