రంగస్థలం అద్భుతంగా వుంది : ఐటి మంత్రి

Monday, April 30th, 2018, 03:53:29 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, అక్కినేని సమంత హీరోయిన్ గా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయి సూపర్ హిట్ సాధించిన చిత్రం రంగస్థలం. 1980 నాటి రాజకీయ నేపధ్యం మరియు రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం, విడుదలయిన ప్రతి చోట మంచి కలెక్షన్లు రాబడుతూ ముందుకెళుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు చిత్రం బాగుందంటూ ప్రసంశలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రాన్ని వీక్షించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు ఐటీ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

ఇవాళ రంగస్థలం చిత్రం చూసాను, ఇంత మంచి చిత్రాన్ని మనకి అందించిన సుకుమార్, రాంచరణ్ కు నా కృతజ్ఞతలు. గ్రేట్ వర్క్ గయ్స్ అంటూ వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. సినిమా చూసి వచ్చిన తర్వాతా కూడా చిత్రం లోని పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, అంత అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. కాగా లోకేష్ ట్వీట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేస్ బుక్ ద్వారా స్పందిస్తూ థాంక్స్ లోకేష్ గారు అని రిప్లై ఇచ్చాడు…..

  •  
  •  
  •  
  •  

Comments