నేటిరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో రంగస్థలం!

Sunday, May 13th, 2018, 10:44:02 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అక్కినేని సమంత హీరోయిన్ గా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన పీరియాడికల్ పొలిటికల్ డ్రామా రంగస్థలం. మార్చి 30న విడుదలయి సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.200 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో స్టడీ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. అయితే ఈ సమయంలో యూనిట్ ఒక ప్రకటన వెలువరించింది. నేటి అర్ధరాత్రినుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకులకు నేటి అర్దరాత్రి నుండి చూసే వెసులుబాటు కలుగనుంది.

నిజానికి ఇప్పటికీ థియటర్లలో ఆడుతూ ఇంకొక నాలుగు రోజుల్లో 50రోజుల పండుగ చేసుకోబోతున్నప్పటికీ, ముందుగా చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రైమ్ లో విడుదల చేస్తోంది యూనిట్. అయితే ఇప్పటికే దాదాపుగా అన్ని పాటలు యూట్యూబ్ లో విడుదలచేసేసింది చిత్ర యూనిట్. ఇకనేటి నుండి పూర్తి హెచ్ డి చిత్రం అందుబాటులోకి రావడంతో చిత్రాన్ని చూడనివారు అమెజాన్ ప్రైమ్ రీఛార్జి చేయించుకుని చిత్రాన్ని చూసి ఆందంచించమని యూనిట్ చెపుతోంది. అయితే సోషల్ మీడియాలో ఈ ప్రదర్శన విషయమై విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు.

ఇదివరకు ప్రైమ్ లో అర్జున్ రెడ్డి, రాజుగారి గది-2, భాగమతి చిత్రాలు మంచి రేటింగ్ దక్కించుకున్నాయి. కాగా ఈ చిత్రం వాటిని ఈజీగా అధికమిస్తుందని చరణ్ ఫాన్స్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదివరకులా కాకుండా ఏదైనా కొత్త చిత్రం విడుదలయిన కొద్దిరోజుల తర్వాత ఆ చిత్ర నిర్మాతలే ఇలా అమెజాన్ ప్రైమ్ వంటి సామజిక మాధ్యమాల్లో విడుదల చేయడం ద్వారా అటు నిర్మాతలకు, చిత్రాన్ని కొన్నసంస్థ వారికీ, అలానే ప్రేక్షకులకు అందరికీ లాభమేనని, దీని ద్వారా కొంతవరకు పైరసీని అరికట్టవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు………

  •  
  •  
  •  
  •  

Comments