ఆ సినిమా నుంచి 40 నిమిషాలు కోసేశారు!

Wednesday, February 22nd, 2017, 01:21:09 AM IST


క‌వ్వింత‌కు క‌వ్వింత‌.. తుళ్లింత‌కు తుళ్లింత‌.. అదీ న‌వ‌త‌రం సినిమాల నుంచి కోరుకునేది. అవ‌న్నీ పుష్క‌లంగా ఉన్న ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 24 రిలీజ్ తేదీ. ఇప్ప‌టికే టీజ‌ర్లు, పోస్ట‌ర్లతో విప‌రీత‌మైన క్రేజు తెచ్చుకున్న ఈ సినిమా టైటిల్ -`రంగూన్‌`. సైఫ్‌ అలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైల‌ర్ల‌లో కంగ‌న ఘాటైన అద‌ర‌చుంబ‌నాలు హీటెక్కించేస్తున్నాయ్‌.

లేటెస్టుగా ఈ సినిమా సెన్సార్ పూర్త‌యింది. 2.47 గంట‌ల‌నిడివి ఉన్న ఈ చిత్రం నుంచి ఏకంగా 40 నిమిషాల స‌న్నివేశాల్ని ఎడిట్ చేసి తొల‌గించిన‌ట్టు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వీక్షించేలా సినిమాని తీర్చిదిద్దామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ సాజిద్ న‌డియావాలా తెలిపారు. మ‌రీ పెద్ద సినిమా చూసే ఓపిక యువ‌త‌కు లేదు. అందుకే ఈ క‌ట్స్ అంటూ ద‌ర్శ‌క‌నిర్మ‌త‌లు విశాల్‌, సాజిద్ న‌డియావాలా తెలిపారు.