హిట్టా లేక ఫట్టా :‘రంగుల రాట్నం’ ట్రెండీ టాక్ !

Sunday, January 14th, 2018, 06:05:07 PM IST

ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో రాజ్ తరుణ్ లో మంచి జోష్ ఉంది. అతడి నటనని అంతా ఇష్టపడతారు. ఉయ్యాలా జంపాల చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. తాజగా రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం చిత్రం సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ కథతో పండగ వేళ యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నేడు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అజ్ఞాతవాసి చిత్రం నిరాశ పరచడం, జై సింహా చిత్రం ఓ మోసరుగా ఆడుతుండడం రంగుల రాట్నం చిత్రానికి కలసి వచ్చే అంశాలు. రంగుల రాట్నం మెప్పించిందా లేదా అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం కొన్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా ఉంటుంది. కానీ అలాంటి సెంటిమెంట్ సన్నివేశాలు ఎక్కువకావడం, చిత్రం నెమ్మదిగా సాగడం బలహీనతగా చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్, కమెడియన్ ప్రియదర్శి మధ్య సాగె సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ ముగిసేవరకు పరవాలేదనిపించే విధంగా ఉన్నా సెకండ్ హాఫ్ కూడా స్లోగా సాగడం ఆడియన్స్ ని నిరాశపరిచి మరొక అంశం. సెంటిమెంట్ ని ఆస్వాదించగలిగే వారికి ఈ చిత్రం నచ్చుతుంది.

 

రంగుల రాట్నం – కొంచెం కామెడీ.. కొంచెం ఎమోషన్

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

రంగుల రాట్నం.. ఇంకొంచెం రంగులుండాల్సింది

Reviewed By tupaki.com|Rating : 2.5/5

స్లీపీ లవ్ డ్రామా

Reviewed By mirchi9.com |Rating : 2.25/5

తిరగని రాట్నం!

Reviewed By greatandhra.com|Rating : 2.5/5