అమీర్ ఖాన్ లవ్ కోసం హీరోయిన్ క్లాసు ఎగ్గొట్టిందట !

Wednesday, January 17th, 2018, 10:41:53 PM IST

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ తాజగా నటించిన చిత్రం హిచ్ కి. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ ప్రయోగాత్మక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా రాణి ముఖర్జీ తన స్కూల్ రోజుల్లో అమీర్ ఖాన్ విషయంలో జరిగిన మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.

1989 లో తాను స్కూల్ లో చదువుకుంటున్నాను. అమిర్ ఖాన్ ఆసమయంలో లవ్ లవ్ లవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దగ్గర్లోనే సినిమా షూటింగ్ జరుగుతుండడంతో క్లాసు ఎగ్గొట్టి మరీ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నాను. ఆయన్ని ఆటోగ్రాఫ్ అడిగితే కసురుకుంటూ చిన్న. మరో పదేళ్ల లోనే ఘులామ్ చిత్రంలో అమిర్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్వచ్చింది. చిన్ననాడు జరిగిన సంగతిని ఆయనకు చెబితే అమిర్ నమ్మలేదు. అప్పటి నుంచి తాను అమిర్ ఖాన్ ని ఆట పట్టిస్తుంటానని రాణి ముఖర్జీ అన్నారు.