మీకు తోచింది రాసుకోండి : రంజిత్ సిన్హా

Tuesday, December 2nd, 2014, 06:53:45 PM IST

Ranjith-sinha
తన పదవీకాలంలో తాను చేసింది ఏమి లేదని… పైగా చివరికి తాను పదవీవిరమణ చేసే సమయంలో ఆరోపణలు ఎదుర్కొనవలసి వచ్చిందని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. పదవీవిరమణ సందర్భంగా విలేఖరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. తను పెద్దగ ఏమి చేయలేదని అన్నారు. 2జీ మరియు బొగ్గు స్కాంల విషయంలో అపవాదును మూటగట్టుకోవలసి వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే తనపై అనేక మంది బురద జల్లారని తను ఇప్పుడు ఏమి… తను ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదని ఆయన అన్నారు. మీకు ఏది తోస్తే అది రాసుకోందని ఆయన విలేఖరులకు చెప్పారు. ఇక తాను ఎవరిని అనుసరించనని… తనకు ఇష్టం వచ్చినది తాను చేసుకుంటూ పోతానని రంజిత్ సిన్హా స్పష్టం చేశారు.