రంగస్థలం విజయోత్సవ వేదిక ఖరారు ?

Thursday, April 12th, 2018, 11:45:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా విజయ డంకా మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల వసూళ్లతో దుమ్ము రేపుతోంది. అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1980 నేపథ్యంలో తెరకెక్కింది. రామ్ చరణ్, సమంత ల నటన హైలెట్ గా నిలిచి విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయోత్సవ వేడుక అమరావతిలో .. లేదా వైజాగ్ లో నిర్వహిస్తావంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజగా విజయోత్సవ వేదికను యూనిట్ ఖరారు చేసింది. ఈ విజయోత్సవం హైద్రాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరగనుందట. ఈ నెల 14న ఈ వేడుకను భారీగా మెగా అభిమానుల సమక్షంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ ముఖ్య అథితిగా వస్తాడట.