నగ్నంగా కెమెరాకు చిక్కిన బాలీవుడ్ హీరో

Sunday, March 18th, 2018, 07:30:38 PM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా అందుకుంటోన్న హీరోల్లో రన్ వీర్ సింగ్ ఒకరని అందరికి తెలిసిన విషయమే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఈ హీరో గత కొంత కాలంగా యువతకు బాగా దగ్గరవుతున్నాడు. జనవరిలో వచ్చిన పద్మావత్ సినిమాతో అయితే మనోడి రేంజ్ చాలా పెరిగిపోయింది. విలన్ గా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ హీరోకి సంబందించిన ఒక న్యూస్ చాలా వైరల్ గా మారింది.

ఎందుకంటే రన్ వీర్ ఒక కెమెరాకు నగ్నంగా చిక్కేశాడట. అనుకోకుండా జరిగిన ఈ ఘటన రణ్వీర్ ఎప్పటికి మరచిపోలేను అను చెబుతున్నాడు. ఒకసారి తన డ్రెస్సింగ్ రూమ్ లో స్నానం చేసి ఎవరు ఉండరు కథా అనుకోని బయటకు వచ్చాడట. అప్పుడు వంటిపై ఏమి లేవట. అయితే రన్ వీర్ బయటకు వస్తే కెమెరా తో ఫొటో తీయాలని ఒక వ్యక్తి చాలా సేపటి నుంచి ఎదురుచూశాడు. రన్ వీర్ నగ్నంగా రావడంతో వెంటనే వీడియో తీసేశాడట. అది గమనించిన రన్ వీర్ అతని దగ్గర నుంచి కెమెరా లాక్కొని వెంటనే డిలీట్ చేశాడట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.