కపిల్ దేవ్ బయోపిక్ లో రణవీర్ సింగ్…. కానీ?

Tuesday, September 26th, 2017, 09:18:47 AM IST

ఇండియాకు వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్ దేవ్. 1983 లో అండర్ గా ఎంట్రీ ఇచ్చి కపిల్ నాయకత్వంలోని టీం వరల్డ్ కప్ గెలుచుకుంది. తాజాగా ఆయన జీవిత కథ ఆధారంగా సినిమా సెట్స్ పైకి రానుంది. బాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ ల హవా మంచి జోరుమీదున్న సంగతి తెలిసిందే…ఈ నేపధ్యంలో ఇదివరకే చాలా మంది బయోపిక్ లు రూపొందాయి.. ఇప్పుడు మరో క్రికటర్ జీవితం తెరపైకి రానుంది. కపిల్ దేవ్ అంటే ఇండియాలో ఈ రేంజ్ క్రేజ్ ఉందో క్రికెట్ అభిమానులకు తెలుసు. మరి ఆయన జీవిత కథ అంటే అది ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది. ఈ సారి ఆయన కథలో..హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. మొదట ఆయన పాత్రకోసం పలువురు హీరోలను పరిశీలించారు. కానీ ఫైనల్ గా రణ్వీర్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట? త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.. అయితే ఈ బయోపిక్ తనది కాదని అంటున్నాడు కపిల్ దేవ్. నా జీవిత చరిత్ర గురించి ఎవరు.. అడగలేదని ఆయన అన్నారు. మరి కపిల్ జీవిత కథతో సినిమా చేస్తే.. ఆయన అనుమతి తీసుకోరా ?

Comments