మొన్న రానా.. ఇప్పుడు రన్ వీర్!

Wednesday, May 9th, 2018, 10:05:24 AM IST

హాలీవుడ్ సినిమాల మార్కెట్ ప్రపంచ దేశాలన్నిటిలో పెరుగుతున్నట్టుగా ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా లోకల్ గ్లామర్ తగలాలని సినిమాలోని పాత్రలకు ఇక్కడి స్టార్స్ వాయిస్ ఓవర్ ను యాడ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన భారీ యాక్షన్ మూవీ అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ లోని విలన్ ధానోస్ పాత్రకు బాహుబలి రానా తెలుగు పాత్రకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమాకు ఆదరణ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది.

ఇక రాబోయే హాలీవుడ్ సినిమాలు కూడా డబ్బింగ్ లలో స్టార్ హీరోల హెల్ప్ తీసుకోవాలని చూస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న డెడ్‌పూల్‌ 2 చిత్రానికి గాను హిందీ డబ్బింగ్ ను బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ చెబుతుండడం స్పెషల్. సినిమాలోని హీరో ర్యాన్‌ రేనాల్డ్స్‌ పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తప్పకుండా ఈ యాక్షన్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రన్ వీర్ చెబుతున్నాడు. ఇక డబ్బింగ్ విషయంపై రెనాల్డ్స్ స్పందిస్తూ.. నేను డబ్బింగ్‌ చెప్పడానికి ఒకవేళ హిందీ కోర్స్‌లో జాయిన్‌ అయ్యుంటే అదోక ఇంటర్నేషనల్‌ ఇన్సిడెంట్‌ అయ్యి ఉండేదని’’ ఫన్నీగా తనకు తానే సెటైర్ వేసుకున్నారు.

Comments