జనసేన ఒక్క మగాడు.. బొత్స ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు..

Tuesday, September 10th, 2019, 03:00:10 PM IST

రాపాక వర ప్రసాద్ జనసేన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థి. కానీ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, వైసీపీ నేతల ఆగడాల పై విమర్శలు తనదైన శైలిలో గుప్పిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు గతం లో మీరు చేసిన విమర్శల పై వివరణ ఇస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బొత్స సత్య నారాయణ కాంగ్రెస్ పార్టీలో వున్నపుడు జగన్ మోహన్ రెడ్డి ని మరియు వారి కుటుంబ సభ్యులపైనా దారుణం గా వ్యాఖ్యలు చేసారు. దానికి సంబందించిన విషయాల పై రాపాక వార ప్రసాద్ బొత్స గారిని ప్రశ్నించారు.

జగన్ కుటుంబ సబ్యల పై న చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. షర్మిల తన భర్త విషయం లో ఏ తప్పు చేసి నా దగ్గరికి సహాయం కోసం వచ్చాడో మర్చిపోయావా? అని షర్మిల ని అన్నారు. వైయస్ బ్రాందీ ముట్టుకోకుండా ఒక్క రోజైన వున్నారా? ముఖ్యమంత్రి పదవి తమ కుటుంబానిది, మేమె రాచరికం చేయాలి అనే మనస్తత్వం విజయమ్మది అని అన్నారు. దోచుకున్నది దాచుకోడానికి జగన్ రాజకీయం అని అతి దారుణం గా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పవన్ ని విమర్శించే ముందు గుర్తొన్చుకొమ్మని అన్నట్లు అన్నారు. ఏదేమైనా రాజకీయాల్లో రాపాక స్టైల్ అదిరిపోయింది కదూ.