హాట్ టాపిక్: జనసేన పార్టీ పై విష ప్రచారం చేస్తుంది ఎవరు?

Sunday, December 15th, 2019, 09:28:21 AM IST

జనసేన పార్టీ ఫై ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియా లో రాపాక వర ప్రసాద్ ఫై పుకార్లు చాల వ్యాపించాయి. అయితే ఈ విషయం లో పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఎవరు చేస్తున్నారో స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. జనసేన పార్టీ లో వున్నా, చచ్చేవరకు జనసేన పార్టీతోనే వుంటాను అని అన్నారు. జనసేన పార్టీ నాకు షోకాజు నోటీసులు జారీ చేయలేదు అని రాపాక వర ప్రసాద్ అన్నారు.

అయితే జనసేన పార్టీకి, రాపాక కు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వున్న విషయం వాస్తవమే అని అన్నారు. పార్టీ నేతలతో ఈ విషయాన్నీ మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకుంటాం అని అన్నారు. అయితే రైతు సౌభాగ్య దీక్షకు గైర్హాజరు కావడం పట్ల రాపాక వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, వ్యక్తిగత పనుల వలనే వెళ్ళలేదు అని తెలిపారు. పవన్ సభకు వస్తున్న ప్రజల ఓట్లు జనసేన కు పడేలా కృషి చేయాలి అని తెలిపారు. అయితే జనసేన ఫై వైసీపీ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరుగుతుందని వివరించారు.