పారదర్శకత పాలన లేని ప్రభుత్వం – జగన్ పై రాపాక ధ్వజం

Friday, September 20th, 2019, 06:04:45 PM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తూనే వున్నారు టీడీపీ,బీజేపీ, జనసేన నేతలు. జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టించారు. గ్రామా సచివాలయ అభ్యర్థులకు అక్టోబర్ లో నియామకం జరగనుందని సమాచారం. ఇది ఇలా ఉండగా గ్రామా సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వస్తున్నా వార్తల పై జనసేన నేత రాపాక వార ప్రసాద్ స్పందించారు. ఆ వివరాలను కింద చూద్దాం.

గ్రామా సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, నిరుద్యోగులు, పరీక్షా రాసిన వారు ఆందోళన చెందుతున్నారు. కానీ మన వైసీపీ ప్రభుత్వానికి ఇవేమి పట్టడం లేదు అని రాపాక అన్నారు. పాలనలో ఎంతో మంచి పేరు తెచుకుంటానని జగన్ అన్నారు. పారదర్శకత గల పాలనని అందిస్తా అన్నారు. రాపాక వార ప్రసాద్ పరీక్షల్లో పారదర్శకత లేదు అని, పాలనలో పారదర్శకత లేదు అని అన్నారు. పారదర్శకత పాటించకుండా ఇలా యువత భవిష్యత్ తో చెలగాటం ఆడితే ఎలా అని ధ్వజమెత్తారు.