రాపాక ఒక్క ట్వీట్ తో వైసీపీ ఫ్యుజ్ లు ఎగిరిపోయాయిగా!

Tuesday, August 13th, 2019, 02:16:32 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక పక్క జనసేన మరో పక్క వైసీపీ పార్టీ శ్రేణులలో జరిగిన సంఘటనల దృష్ట్యా రెండు పార్టీలలోనూ కలకలం రేగిన సంగతి అందరికి తెలిసిందే.ముఖ్యంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చంపేస్తామని బెదిరింపులు చేసిన వైసీపీ ఎమ్మెల్యేను వదిలేసి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి రాపాక వరప్రసాద్ ను టార్గెట్ చెయ్యడం అతని మీదే కొన్ని అమ్ముడుపోయిన మీడియా సంస్థలు దుష్ప్రచారాలు చెయ్యడంతో జనసేన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా జనసేన ఎమ్మెల్యే కూడా ఎక్కడా తగ్గడం లేదు.ప్రజా సమస్యలపై నా మీద కేసులు పెడుతున్నారని ఎన్నో తప్పులు చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణాని అంటున్నారు.ఇదిలా ఉండగా ఇపుడు ఈ రెండు పార్టీల అభిమానులు మధ్య నడుస్తున్న కామన్ పాయింట్ ఒకటి ఉంది.వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వారు ఇలా చేస్తున్నారన్న పాయింట్ వస్తుంది.ఇదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వంపై రాపాక వేసిన పంచ్ దెబ్బకి వారు ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెప్పాలి.

జగన్ కు స్వయానా బాబాయ్ అయినటువంటి వై ఎస్ వివేకానంద రెడ్డి బాత్రూమ్ హత్యా ఘటన ఎంతటి దుమారాన్ని రేపిందో వేరే చెప్పక్కర్లేదు.ఇపుడు తనపై వైసీపీ చేస్తున్న పనికి గాను “మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా ప్రవర్తించి , ప్రజల పక్షాన నిలబడ్డ చట్టం ముందు అందరూ సమానమే బాత్రూమ్ లో జరిగిన హత్య కేసులో కూడా తప్పు చేసినవారికి శిక్షలు వేయండి…” అంటూ సంచలన ట్వీట్ పెట్టారు.అయితే ఇది అధికారికంగా రాపాక ట్విట్టర్ అకౌంటో కాదో కానీ మొత్తానికి ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది.