సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెప్పిన రాపాక..!

Wednesday, August 14th, 2019, 12:34:49 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్ ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రాపాక అనుచరులు మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారని పోలీసులు రాపాకపై మరియు అతడి అనుచరులపై కేసు నమోదు చేసారు. అయితే ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో రాపాక స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే రాపాకను పోలీసులు కోర్ట్‌లో హాజరుపరిచారు. అయితే కోర్ట్ మాత్రం పోలీసులను మందలించి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసే విధానం ఇది కాదని, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విజయవాడలోని ప్రత్యేక కోర్ట్‌కు వెళ్ళాలని సూచించింది. అంతేకాదు రాపాకకు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించిది. అయితే పోలీసులు రాపాకకు స్టేషన్ బెయిల్ మంజూర్ చేసి విడుదల చేసారు.

అయితే స్టేషన్ నుంచి భయటకు వచ్చిన రాపాక తన ట్విట్టర్ ద్వారా తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయబద్ధంగా పోరాడిన నాకు అండగా నిలబడిన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన రాష్ట్ర నాయకులు, తూర్పు గోదావరి జిల్లా నాయకులకు, రాష్ట్రవ్యాప్తంగా నాకు మద్దత్తుగా నిలబడిన ప్రతిఒక్క జనసైనికులకి, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నా మీద అసత్య నిందారోపణలు చేసి, అక్రమ కేసులు సెక్షన్స్ పెట్టి మమ్మలిని భయబ్రాంతులకు గురిచేయాలని చూసిన వైసీపీ వారి కుట్రలను చాలా చకాచక్యంగా సంయమనంతో తీపీకొట్టి నాకు అండగా నిలబడిన కార్యకర్తలకి, సోషల్ మీడియా ద్వారా నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.