జన సైనికులకు రాపాక వరప్రసాద్ సందేశం…ఏంటో తెలుసా?

Thursday, December 12th, 2019, 07:29:55 AM IST

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు జనసైనికులను బాగా కలవరపెట్టాయి. తన నిర్ణయం, తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు పూర్తీ వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసింది. అయితే రాపాక చేసిన వ్యాఖ్యలకు కొందరు సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అదే విషయాన్నీ రాపాక వరప్రసాద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రాపాక చేసిన వ్యాఖ్యలకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని పక్కన పెట్టి వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నాని రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియా లో తెలియజేస్తున్నారు ప్రజలు. అయితే ఒక దళిత ఎమ్మెల్యే గా పేద విద్యార్థులు ఏ రంగంలో వెనకబడకూడదు అని రాపాక అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరితో సమానంగా భవిష్యత్ లో అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని, అదే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని బలపరిచా అని, తెలుగుని విస్మరిస్తూ, తెలుగు సంస్కృతిని పక్కన బెట్టి ఆంగ్ల మాధ్యమాన్ని కల్పించండి అని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు.

అయితే కొందరు నా రాజీనామా అంటూ రకరకాల క్యాప్షన్స్ పెట్టి జనసైనికులని పక్కదారి పట్టించే విధంగా ట్రోలింగ్ మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే జనసైనికులు అంతా నా ఫై దృష్టి పక్కనపెట్టి రైతు సౌభాగ్య దీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. రైతులకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయండి అని సందేశాన్ని ఇచ్చారు. అయితే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో రాపాక ఈ కార్యక్రమానికి హాజరు కావడం కుదరదు అని అందరికీ తెలిసిన విషయమే.