గానగంధర్వుడు ఎస్పీ బాలుకి 47వ గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సన్మానం జరిగింది. ఆయన సినిమాకి చేసిన విశేష సేవల్ని గుర్తించి సెంటినరీ అవార్డునిచ్చి గౌరవించారు. ఈ ఆదివారం సాయంత్రం గోవాలో 47వ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల ప్రారంబోత్సవ వేళ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి సెంటినరీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవార్డు బహూకరణతో పాటు, శాలువా కప్పి సన్మానించారు
తనకి దక్కిన సెంటినరీ అవార్డును బాలు తన మాతృమూర్తికి అంకితమిచ్చిన బాలు.. తన సినీ గురువు ఎస్పీ కోదంపాణికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల మధ్య కాపలా కాస్తూ.. దేశాన్ని కాపాడుతున్న సైన్యాన్ని ఈ సందర్భంగా తలచుకుని అందరిలో స్ఫూర్తిని నింపారు. తనకి దక్కిన పురస్కారం దేశ భద్రతకు కారకులైన వారికి అంకితమిస్తున్నానని ప్రకటించి బాలు శభాష్ అనిపించారు. ఈ ఉత్సవంలో ఎస్పీబీ పరిపూర్ణమైన ఆంగ్లంలో మాట్లాడతూ అహూతుల్ని ఔరా! అనిపించారు.