హ్యాపీ బి-డే : చెర్రీకి టైమ్ ట్రావెల్ వాచ్‌ కానుక‌!?

Tuesday, March 27th, 2018, 01:12:53 AM IST


24 సినిమా క‌థాంశం మొత్తం టైమ్ ట్రావెల్ వాచ్ చుట్టూ తిరుగుతుంది. వ‌ర్త‌మానంలోంచి గ‌తంలోకి, గ‌తం నుంచి భ‌విష్య‌త్‌లోకి .. తీసుకెళ్ల గ‌లిగే ఆ వాచ్ మ‌న‌కు కూడా దొరికితే ఎంత బావుంటుందో అనుకున్నాం. అంతా బాగానే ఉంది కానీ, అలాంటిది త‌యారు చేయ‌డం అన్న‌ది ఓ క‌ల‌. కానీ ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే, త‌న గారాల పుత్రుడు రామ్‌చ‌ర‌ణ్‌కి మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంప‌తులు అలాంటి కానుకే ఇచ్చిన‌ట్టు అనిపిస్తోంది.

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ డాడ్‌ మెగాస్టార్ నుంచి అరుదైన కానుక అందుకున్నారు. ఈ మంగ‌ళ‌వారం ( 27న) త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ ఖ‌రీదైన వాచ్‌ని చ‌ర‌ణ్ పేరెంట్స్ కానుక‌గా ఇచ్చారు. ఈ ఫోటోని చ‌ర‌ణ్ స్వ‌యంగా ఎఫ్‌బిలో పోస్ట్ చేయ‌డంతో అభిమానులు దీనిని జోరుగా షేర్ చేశారు. ఒక‌రోజు ముందే మ‌మ్మీ డాడ్ నుంచి రేర్ గిఫ్ట్ అందుకున్న చ‌ర‌ణ్ చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. “ముందస్తుగా టైమ్‌లెస్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అమ్మానాన్నకు ధన్యవాదాలు“ అని అన్నారు రామ్‌చ‌ర‌ణ్‌. చ‌ర‌ణ్‌ `రంగ‌స్థ‌లం` ఈనెల 30న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.