ర‌స‌మ‌యీ.. గో బ్యాక్ అంటూ ఎటాక్‌!!

Saturday, October 20th, 2018, 02:15:25 AM IST


మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక వ్య‌వ‌హారాల‌ చైర్మన్ రసమయి బాలకిషన్ కు ఘోర ప‌రాభ‌వ‌మిది. క‌రీంన‌గ‌ర్ జిల్లా ఎల్ఎండీ కాల‌నీలోని బ‌తుక‌మ్మ సంబ‌రాల్ని వీక్షించేందుకు వెళ్లిన ఆయ‌న‌పై కార్య‌క‌ర్త‌లే ఎటాక్ చేయ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఎదురైంది. ర‌స‌మ‌యీ.. గో బ్యాక్‌! అంటూ నినాదాల‌తో ఆ ప్రాంతం హోరెత్తింది. ఆ క్ర‌మంలోనే పోలీసులు రంగంలోకి దిగి ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌ల్ని చిత‌క బాద‌డంతో గొడ‌వ చినికి చినికి గాలివాన అయ్యింది. దీంతో ఆగ్ర‌హం పెల్లుబికి స్థానికులు తీవ్ర నిర‌స‌న‌ల‌కు దిగారు.

ఇదొక్క‌టే కాదు.. బుధవారం రాత్రి బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించేందుకు ముస్కాని పేటకు వెళ్లిన‌ప్పుడు సేమ్ సీన్ బెంబేలెత్తించింది. అంబేద్క‌ర్, జ్యోతీరావ్ పూలే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ల వేళ పిలిచిన‌ప్పుడు రాని నేత ఇప్పుడు ఎందుకు వ‌చ్చిన‌ట్టు? అంటూ యువ‌త నిల‌దీయ‌డంతో ర‌చ్చ‌య్యింది. మొత్తానికి ర‌స‌మ‌యిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ని ఈ ఘ‌ట‌న‌లు నిరూపంచాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో స‌ద‌రు నాయ‌కుడు ఎంత‌వ‌ర‌కూ గెలుస్తాడు? అన్న‌ది సందేహ‌మేన‌ని ఈ స‌న్నివేశం చెబుతోంది. తేరాస‌కు ఇది పెనుగండ‌మేన‌ని తాజా స‌న్నివేశం చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments