మాస్ రాజాను ఘాటు ముద్దుల్లో ముంచేసిన చిన్నది ?

Wednesday, January 17th, 2018, 06:52:36 PM IST

ఈ మధ్య హీరోయిన్లు బాగా ఫాస్ట్ అవుతున్నారు. ఇన్నాళ్లు కండిషన్స్ అప్లై అంటూ పలు కండిషన్స్ పెట్టిన భామలే అవకాశాలు రాకపోవడంతో అన్ని కండిషన్లు పక్కన పెట్టి .. అన్నింటికీ రెడీ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ రంగంలో కండిషన్స్ అంటే మొదటికే మోసం వస్తుంది మరి. అందుకే వాళ్ళు వస్ట్ అవుతూ .. అటు ట్రెండ్ ను బాగా ఫాలో అవుతున్నారు. ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ గర్ల్ గా ఇమేజ్ తెచ్చుకున్న రాశి ఖన్నా కూడా డోర్స్ ఓపెన్ చేసింది. ఇన్నాళ్లు కొన్ని కండిషన్స్ అంటూ పెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు అన్నింటికీ రెడీ అవుతుంది. తాజాగా మాస్ రాజా రవితేజ తో కలిసి టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఈ అమ్మడి అందాల జాతర ఓ రేంజ్ లో షాక్ ఇస్తుందట .. దానికి తోడు .. రవితేజ తో కలిసి ఘాటు లిప్ లాక్ పెట్టేసిందట !! అది విషయం. ఇదివరకే రవితేజ తో బెంగాల్ టైగర్ లో నటించిన రాశి ఖన్నా .. ఇప్పుడు రవితేజతో మరో సారి నటిస్తుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి చాలా రోజులు అవుతున్నా కూడా అనుకున్న క్రేజ్ , సక్సెస్ రేట్ దక్కడం లేదు . అందుకే ఇలా రెచ్చిపోయిందేమో .. మరి ఈ సినిమాతో అయినా ఈ భామకు కలిసి వస్తుందేమో చూడాలి.