కోలీవుడ్ పై కన్నేసిన రాశి ఖన్నా ?

Tuesday, September 11th, 2018, 11:04:28 PM IST


ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న బొద్దుగుమ్మ రాశి కన్నా ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది. గ్లామర్ గర్ల్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఈ మధ్య సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఆ మధ్య సుప్రీం సినిమా ఒక్కటే కాస్త మంచి హిట్ అందించింది . ఆ తరువాత చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో అటు కోలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాశి ఖన్నా కు కోలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న రాశి ఖన్నా .. ఫోకస్ మొత్తమ్ కోలీవుడ్ పైనే ఉందట. ఆమె నటించిన మొదటి సినిమా ఇమ్మిక్కి ఒదగల్ సూపర్ హిట్ అవ్వడంతో రాశి కు అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చెన్నై లోనే సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉందట.

  •  
  •  
  •  
  •  

Comments