లక్కీ ఛాన్స్ కొట్టేసిన చలో హీరోయిన్ ?

Sunday, March 18th, 2018, 06:01:43 PM IST

కన్నడ కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా రష్మిక మండన తెలుగులోకి నాగశౌర్య చలో సినిమాతో తెలుగు తెరకెకు పరిచయం అయినా ఈ అమ్మడు ఇక్కడా మంచి హిట్ అందుకుంది. అందానికి అందం .. గ్లామర్ పుష్కలంగా ఉన్న రేష్మక కు తాజాగా మరో లక్కీ ఛాన్స్ దక్కింది. తాజాగా నాగార్జున – నాని ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టి స్టారర్ లో ఓ హీరోయిన్ గా ఎంపిక అయిందట. నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందంటే ఈ అమ్మడు లాక్కు తొక్కినట్టే. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అమల పాల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శమంతక మని ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉగాది నుండి మొదలు కానుంది. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక నాని కి జోడిగా నటిస్తుందట.