గోవిందం హీరోయిన్ నితీన్ ఫేట్ మారుస్తుందా ?

Friday, September 14th, 2018, 02:46:56 PM IST

యంగ్ హీరో నితిన్ కి మళ్ళీ వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. నితిన్ తాజాగా నటించిన లై, చిన్నదానా నీకోసం, చల్ మోహన్ రంగ సినిమాల ప్లాప్ తో టెన్షన్ మీదున్నాడు. దాంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న దిల్ రాజు శ్రీనివాస్ కళ్యాణ్ కూడా పెద్ద దెబ్బెకొట్టింది. దాంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. నితిన్ తాజాగా చలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఎంపిక చేశారట. రష్మిక చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. దాంతో పాటు రష్మిక తాజాగా గీత గోవిందం సినిమాతో మంచి విజయం అందుకుని టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మరి రష్మిక క్రేజ్ హీరో నితిన్ కి మంచి కమర్షియల్ విజయాన్ని ఇస్తుందో లేదు చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments