పిక్ టాక్‌ : అందాల‌ `రాశి`కి కొమ్ములు మొలిచెనే!

Saturday, December 2nd, 2017, 01:30:49 AM IST

రాశీ ఖ‌న్నా.. కెరీర్ ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ సినిమా `మ‌ద్రాస్ కేఫ్‌`తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన రాశీ, ఆ త‌ర్వాత అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో టాలీవుడ్‌కి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఇంతింతై అన్న చందంగా ఇక్క‌డ ఎదిగేసింది. న‌వ‌త‌రం నాయిక‌ల్లో మోస్ట్ ఛాలెంజింగ్ గాళ్‌గా ప్రూవ్ చేసుకుంది. నిన్న‌నే త‌న పుట్టిన‌రోజును ఘ‌నంగా జ‌రుపుకుంది ఈ భామ‌. బ‌ర్త్ డే వేడుక‌ల‌కు త‌న హీరోలంద‌రిని ఆహ్వానించింది. మాస్‌ మ‌హారాజ్ ర‌వితేజ‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, రానా, నాగ‌చైత‌న్య‌, వ‌రుణ్‌తేజ్‌, ర‌కూల్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొని చీర‌ప్ చేశారు. పార్టీలో ఒక్కొక్క‌రికి ఒక్కో హ‌గ్ ఇచ్చిన రాశీ .. మ‌స్త్ మ‌జాగా ఎంజాయ్ చేసింది. ఇట్స్ పార్టీ టైమ్ అంటూ రాశీ చేసిన హ‌డావుడి ఏ రేంజులో సాగిందో తెలియాలంటే .. ఇదిగో ఈ ఫోటో చూసి తీరాలి.

  •  
  •  
  •  
  •  

Comments