బిగ్ బాస్ 2లో ఉన్నావంటే రత్తాలు ఫైర్ అయింది ?

Monday, June 11th, 2018, 12:03:09 AM IST

సౌత్ లో ఆసక్తి కలిగిస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ కు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. నాని హోస్ట్ గా చేస్తున్న తెలుగు షో ఈ రోజు మొదలైంది. ఇక తమిళంలో వచ్చే ఈ షో ఈ నెల 17 నుండి ప్రారంభం కానుంది. ఇక షో లో ఎవరు పాల్గొంటారా అన్న ఆసక్తి ఇప్పటికే తమిళ ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువైంది. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న ఈ రెండో సీజన్ లో లక్ష్మి రాయ్ పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో లక్ష్మి రాయ్ పాల్గొంటుందని ప్రచారం జరుగుతున్న విషయం పై లక్ష్మి రాయ్ ఫైర్అయింది. ఖాళీగా నేను ఉన్నానని అందుకే బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేను ఇదివరకే చెప్పను.. బిగ్ బాస్ లో నేను పాల్గొనడం లేదని, అయినా ఛానల్ కు చెందినా కొందరు సిల్లీ ఫెలోస్ ఇలా కావాలనే తన పేరుని ప్రచారం చేస్తున్నారని .. పేర్కొంది.